Header Banner

గుడ్ న్యూస్.. ఇప్పుడు మరింత ఈజీగా పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం! ఇలా చేయండి!

  Sun May 04, 2025 16:29        Others

తపాలా శాఖ పోస్టాఫీసు పథకాల్లో డిజిటల్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆధార్‌ బయోమెట్రిక్‌ సాయంతో ఖాతాలు సులభంగా తెరవొచ్చు. పేపర్‌ వర్క్‌ అవసరం లేకుండా ఈ-కేవైసీ విధానం అమలు.

 

సామాన్య ప్రజల కోసం పోస్టాఫీస్ అనేక పథకాలను ప్రవేశపెట్టింది. చిన్నచిన్న పెట్టుబడులతో దీర్ఘకాలిక లాభాలను అందించేందుకు పోస్టాఫీస్ ఎప్పుడూ మంచి పథకాలను తీసుకొస్తూ ఉంటుంది. దీంతో గ్రామీణ ప్రజలు సైతం వీటిలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.

 

తాజాగా ఈ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పోస్టాఫీస్ మరో ముందడుగు వేసింది. ఈ పథకాల్లో చేరే ప్రక్రియను మరింత ఈజీగా చేసింది. మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ (Monthly Income Schemes), టైమ్‌ డిపాజిట్‌ (Time Deposit), కిసాన్‌ వికాస్‌ పత్ర (Kisan Vikaas patra), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (National Savings Certificate) వంటి అకౌంట్లను డిజిటల్‌ ప్రాసెస్‌లో ఓపెన్ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చింది. అంటే.. కేవలం ఆధార్‌ బయోమెట్రిక్‌ (Aadhaar eKYC) సాయంతో ఈ అకౌంట్లను ఈజీగా ఓపెన్ చేయవచ్చు. పేపర్‌ వర్క్ కూడా అవసరం లేదు.

 

ఇది కూడా చదవండి: డిగ్రీ అర్హతతో యూనియన్‌ బ్యాంకులో ఉద్యోగావకాశాలు! ఎంపికైతే నెలకు రూ.85 వేల జీతం!

 

ప్రస్తుతం పోస్టాఫీస్‌లో సేవింగ్స్‌ అకౌంట్‌ తెరవాలంటే ఆధార్ ఈకేవైసీ తప్పనిసరి. ఈ విధానాన్ని జనవరి నుంచే ప్రారంభించింది. ఏప్రిల్‌ 24 నుంచి దీన్ని మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌, టైమ్‌ డిపాజిట్‌ స్కీమ్‌, కిసాన్‌ వికాస్‌ పత్ర, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ వంటి పాపులర్‌ పథకాలకూ విస్తరించింది. ఈ మేరకు తాజాగా ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. పోస్టాఫీసు కార్యాలయాల్లో ఆయా ఖాతాలన్నీ ఆధార్‌ ఈకేవైసీ సాయంతో సులువుగా తెరవొచ్చని పేర్కొంది.

 

ఇప్పుడున్న పద్ధతి ప్రకారం.. పైన చెప్పిన ఏదైనా అకౌంట్‌ను ఓపెన్ చేయాలంటే డిపాజిట్‌ వోచర్‌, ఫిజికల్‌ ఫామ్స్ నింపాల్సి ఉంటుంది. ఇకపై పోస్టాఫీసుల్లో రెండు పద్ధతులూ అందుబాటులో ఉంటాయి. ఇందులో భాగంగా ఈ ఖాతాలను తెరవడానికి వెళ్లినప్పుడు పోస్టల్‌ అసిస్టెంట్‌ తొలుత డిపాజిటర్‌ నుంచి బయోమెట్రిక్‌ (Finger Print) వివరాలు సేకరిస్తారు. తర్వాత పేరు, స్కీమ్‌ టైప్‌, డిపాజిట్‌ మొత్తం వంటి వివరాలు నమోదు చేస్తారు.

 

మీరు ఇచ్చిన వివరాలను ధ్రువీకరించిన తర్వాత ఫైనల్ సబ్మిషన్‌ కోసం మరోసారి మీ నుంచి బయోమెట్రిక్‌ వివరాలు సేకరిస్తారు. దీంతో మీ లావాదేవీ పూర్తవుతుంది. ఈక్రమంలో డిపాజిట్‌ ఫారం కూడా నింపాల్సిన అవసరం లేదు. అంతేకాదు వివరాల నమోదు ప్రక్రియలో ఆధార్‌లోని తొలి 8 నంబర్లను పోస్టల్‌ సిబ్బంది మాస్క్‌ చేస్తారు. చివరి నాలుగు నంబర్లు మాత్రమే సేకరిస్తారు. దీంతో అకౌంట్ సెక్యూరిటీ బలపడుతుందని పోస్టాఫీస్ పేర్కొంది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే! రూ.647 కోట్లతో.. ఆ రూట్‌లో నాలుగ లైన్లుగా! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #GoodNews #PostOfficeSchemes #InvestmentMadeEasy #PostOfficeSavings #DigitalIndia #OnlineInvestment #PostOfficeUpdates